తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హీల్స్ కు చెందిన స్మగ్లర్ కందస్వామి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా చాపాడు మండలం కాదర్ పల్లి వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ తెలిపారు. నింధితుడిపై కడప జిల్లాలో మొత్తం 31 నమోదు కాగా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉందన్నారు. వెంకటేష్ పై ఇతర జిల్లాలతో కలిపి మొత్తంగా 47 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. 2016 మార్చి నెలలో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిలు పై విడుదలయినప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నింధితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: స్మగ్లర్లు అరెస్ట్..ఎర్రచందనం దుంగలు స్వాధీనం