ETV Bharat / state

అంతర్జాతీయ ఫోన్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు - three members arrest

ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేసుకుని అమాయక ప్రజలకు కలుపుతూ.. అక్రమార్జన చేస్తున్న ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ముఠా అరెస్టు
author img

By

Published : Sep 20, 2019, 11:40 PM IST

అంతర్జాతీయ ఫోన్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

కడప జిల్లా రాజంపేట టెలిఫోన్ శాఖకు చెందిన ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ కాల్స్ ని రిసీవ్ చేసుకునే కేంద్రంపై దాడి చేసి 500 సిమ్ కార్డులతోపాటు కంప్యూటర్లు, లాప్ టాప్, సిమ్ము లను అమర్చే ప్రత్యేక పరికరాన్ని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను, వస్తువులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివిధ దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గేట్ వే వద్ద రికార్డు అయి వస్తాయని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. రికార్డ్ చేసిన కాల్ ఎవరు చేశారు ఎక్కడినుంచి చేశారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. గేట్​వే వద్ద రికార్డ్ కాకుండా నేరుగా వచ్చే కాల్స్ తో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని గేట్​వేలో రికార్డు కాకుండా నేరుగా రాజంపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరికరానికి చేరుతున్నాయని తెలిపారు. ఇక్కడినుంచి స్థానిక సిమ్ కార్డుల ద్వారా ప్రజలకు కాల్స్ వెళ్తాయని వివరించారు. దీనివల్ల కాల్ బయట నుంచి వచ్చిందనే విషయం తెలియదని చెప్పారు. భారతదేశంలో నిషేధించిన ఓ పరికరాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కాల్ ని స్థానిక కాల్స్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఈ వ్యవహారంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ప్రధాన సూత్రదారుడన్నారు. ప్రస్తుతం అతను కువైట్​లో ఉన్నట్టు వివరించారు. టెలిఫోన్ కార్యాలయంలో పని చేస్తున్న మహమ్మద్ షరీఫ్ తో పాటు సిమ్ కార్డులను సరఫరా చేసిన రాజు, రాజశేఖర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి.

యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం మధు పర్యటన

Intro:AP_TPG_21_20_ACCIDENT_6DEAD_AVB_AP10088
యాంకర్: దైవ దర్శనానికి అని బయలుదేరిన ఆ కుటుంబం రోడ్ ప్రమాదంలో మరణించింది. తెగి పడిన గాయాలతో ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆర్త్ నాదాలు మిన్నంటాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబచర్ల లో జరిగిన రోడ్ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం కు చెందిన 11 మంది కుటుంబం తిరుపతి దర్శనానికి బయలు దేరారు. తిరుగు ప్రయాణం లో వెళ్తుండగా ఆగివున్న లారీను డీ కొట్టడంతో ఒమిని వ్యాన్ లో ఉన్న పలుకూరి అప్పలరాజు, రామకృష్ణ, నీలకంఠ, లక్ష్మీ, చిన్నారులు తనుజా, జ్ఞానేశ్వర్ లు మృతి చెందింది. సంఘటన స్థలంలో ఇద్దరు చనిపోగా ఆసుపత్రిలో మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ పరిసీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు
బైట్: డియస్పీ, తాడేపల్లిగూడెంBody:ఆక్సిడెంట్ 6 డెడ్Conclusion:గణేష్, జంగారెడ్డిగూడెం, 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.