ప్రాణవాయువు, బెడ్ల సౌకర్యం కల్పించి ప్రాణాలు రక్షించాలంటూ కడపలో ఆశా రేఖ ఫౌండేషన్ సంస్థ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రాణవాయువు, బెడ్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడాలంటూ అంబేడ్కర్ కూడలి వద్ద చేతిలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
వందల మంది మృత్యువాత పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. కనీసం ప్రజలకు వ్యాక్సిన్ వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమని ఆరోపించారు. ఏ ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజలందరికీ కరోనా టీకా వేయాలని ఆశా రేఖ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: