74వ స్వాతంత్య్ర దినోత్సవానికి కడప పోలీస్ మైదానం ముస్తాబయ్యింది. మైదానమంతా జెండాలతో అలంకరించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. అక్షరాల మధ్యలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ వేసిన బొమ్మలు ఆకట్టుకుంది. పరిమిత సంఖ్యలోనే వచ్చే అతిథులు కోసం 6 అడుగుల దూరంలో భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ఏఆర్ అదనపు ఎస్పీ రిషి కేశవ రెడ్డి పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: 'వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే తీసుకెళ్తాం'