కడప జిల్లా కమలాపురంలో 2011 సంవత్సరంలో కమలకూరు వద్ద సగిలేరు నదికి అడ్డంగా 12 కోట్ల తో ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం కారణంగా 120 ఎకరాల వ్యవసాయ భూమిని రైతులు కోల్పోయారు. 80 ఎకరాల భూమికి పరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి ఇంకా పరిహారం చెల్లించలేదు . డీకేటీ భూమి, ఎకరాకు లక్ష 25 వేల నుంచి 50 వేల వరకు, రిజిస్ట్రేషన్ భూమికి రెండున్నర లక్షల పరిహారం చెల్లించారు. కమలకూరు ఆనకట్ట కింద రెండు వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటి వరకూ పనులే జరగలేదు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోవటంతో రైతులు అన్ని విధాల నష్టపోయారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు కమలకూరు ఆనకట్ట నిర్మాణం పనులు పూర్తి చేసి ...భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వదిలేసిన నిర్మాణ పనులు తిరిగి చేపట్టి, అందరికీ ఉపయోగపడేలా త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:చారిత్రక శ్మశానం- యువత కష్టంతో పరిశుభ్రం