ఎర్రచందనం చెట్లును స్మగ్లర్ల నుంచి రక్షించేందుకు అటవీశాఖ సీసీ కెమెరాలు వినియోగిస్తోంది. కడప జిల్లాలోని అటవీ శాఖ అధికారులు వీటిని వినియోగంలోకి తెచ్చారు. అధికారులు కార్యాలయాల్లో వీక్షించే విధంగా రూపకల్పన చేశారు. క్షేత్ర స్థాయి అధికారుల పనితీరు తెలుసుకునే విధంగా చరవాణిలకు వీటిని అనుసంధానం చేశారు. ప్రొద్దుటూరు, రాజంపేట అటవీశాఖ డివిజన్లోని 15 రేంజ్ కార్యాలయాలు, ప్రధాన రహదారుల్లోని చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని బద్వేలు అటవీశాఖ ప్రాంతీయ క్షేత్ర అధికారి సుభాష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: