కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై. కోట అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగల అక్రమ తరలింపును అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి.. 80 వేల రూపాయలు విలువచేసే 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. మందస్తు సమాచారం మేరకు అడవిలో తనిఖీ నిర్వహించగా వీరు పట్టుబడ్డారని.. మరో 15 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో కోడూరు ఎఫ్ఆర్వో నాయీమ్ అలీ వారి సిబ్బంది పాల్గొన్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండీ.. JAGAN-CHIRU TWEETS: చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన జగన్..ఏమన్నారంటే