ETV Bharat / state

సోమశిల జలాశయంలో నిషేధిత వలలతో చేపల వేట

author img

By

Published : Jan 22, 2023, 7:40 AM IST

సోమశిల జలాశయ వెనక జలాల్లో అక్రమ చేపల వేట కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు నిషేధిత వలలతో చేపలను వేటాడి అక్రమార్జన సాగిస్తున్నారు. ఇంతా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

somasila reservoir
Illigal Fishing

Illigal Fishing in Somasila : సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే జలాశయ వెనక జలాలు మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 22 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న.. ఈ జలాల్లో నిషేధిత వలలతో చేపల వేట కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ జాలర్లు నిషేధిత వలలను వినియోగించి చేపల వేట కొనసాగిస్తున్నారు. చిన్న రంధ్రాలు కలిగిన వలలను వినియోగించి.. చిరు చేపలను వేటాడుతున్నారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే ఈ అక్రమ వేట కొనసాగుతోందని సమాచారం.

ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం, పెనగలూరు, సిద్ధవటం మండలాల్లో సోమశిల వెనక జలాలు విస్తరించి ఉన్నాయి. ఈ జలాల్లో చేపలను మత్స్యకారులు వేటాడి విక్రయించుకోవటానికి కొన్ని షరతులతో అనుమతి ఉంది. గాలం, చిలుకు వల, బోటుల ద్వారా చేపలు పట్టుకుంటే సమస్య లేదు. కానీ చిన్న చిన్న రంధ్రాలు కలిగిన వలలను చేపల వేటకు వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈ వలల వల్ల చిరు చేపలు వలలకు చిక్కుతాయి. దీనివల్ల మత్స్య సంపద అంతరించే అవకాశం కలదని.. కొన్ని వలలను వినియోగించటానికి వీలు లేదు.

కొందరు అక్రమార్కులు ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జాలరులను రప్పించి ఈ దందా నడిపిస్తున్నారు. నైపుణ్యం కలిగిన జాలర్లు ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వచ్చి.. నది ఒడ్డునే గుడారాలు వేసుకుని వేట కొనసాగిస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలావారి వేతన రూపంలో చెల్లించి ఇక్కడికి రప్పిస్తున్నారు. జాలర్లు వేటాడిన చిరు చేపలను ఎండబెట్టి విక్రయిస్తున్నారు. ఇవి కిలో రూ. 150 నుంచి 200 వరకు పలుకుతున్నాయి.

నిషేధిత వలలను వినియోగించి చేపల వేట కొనసాగుతున్న మత్య్సశాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నది ఒడ్డున స్థావరాలు ఏర్పాటు చేసుకుని యథేచ్చగా వేట కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. నిషేధిత వలల ద్వారా చేపల వేటను అడ్డుకుని మత్స్య సంపదను కాపాడాలని మత్య్సకారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.