ETV Bharat / state

'కొండను లీజుకు ఇస్తే అన్ని విధాలుగా నష్టపోతాం'

కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామం వద్ద భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కంకర మిషన్​కు సుమారు 10 హెక్టార్ల కొండను లీజుకు ఇచ్చే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ పోలీస్ బందోబస్తు నడమ నిర్వహించారు.

కొండను లీజుకు ఇస్తే అన్ని విధాన నష్టపోతాం : గ్రామస్తులు

author img

By

Published : Nov 6, 2020, 9:43 PM IST

కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామం వద్ద భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కంకర మిషన్​కు సుమారు 10 హెక్టార్ల కొండను లీజుకు ఇచ్చే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ పోలీస్ బందోబస్త్ నడమ నిర్వహించారు.

10 హెక్టార్ల కొండ లీజుకు..

ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ జావిద్ భాష అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి హాజరయ్యారు. 10 హెక్టార్ల కొండను లీజుకు ఇస్తే చిన్న దుద్యాల, పెద్ద దుద్యాల గ్రామస్తులు అన్ని విధాల నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి..

గతంలో కొండల్లో జరిపిన పేలుళ్ల వల్ల పెద్ద ఎత్తున నివాసాలు దెబ్బ తిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూలంగానే పరిసర ప్రాంతాలు దుమ్ము ధూళితో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని విధాలా నష్టపోతామని.. లీజుకి ఇవ్వొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.

300 మంది పోలీసులు..

సుమారు 30 మంది గ్రామస్తుల నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జేసీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300 మంది పోలీసులు పహారా కాశారు.

తీర్మానం రద్దు చేయాలి..

సుమారు పదకొండు గంటలకు రాళ్ల తరలింపునకు సంబంధించిన తీర్మానం రద్దు చేయాలని ఎమ్మెల్యే కోరారు. చిన్న గ్రామాలకు చెందిన ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారు.

ఇవీ చూడండి:

విశాఖ నగరంలో దొంగల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.