తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్న ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఘటన పూర్తిగా ప్రజా వ్యతిరేకత వల్ల జరిగిందే తప్ప వైకాపా పాత్ర ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. పోలీసుల పనితీరు బాగా లేదనడం సరికాదన్నారు. ఇవాళ కడప పర్యటనకు వెళ్లిన హోంమంత్రి సుచరిత..... కడప పెద్ద దర్గాను సందర్శించారు. అలాగే కేంద్ర కారాగారాన్ని పరిశీలించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కారాగారంలో ఫర్నీచర్ తయారీ, వృత్తి నైపుణ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
ఇవీ చదవండి: 'విశాఖ వచ్చి తీరుతా.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా'