కరోనా కష్టాలతో అల్లాడిపోతున్న పేదలను ఆదుకునేందుకు హిజ్రాలు ముందుకు వస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాయచోటికి చెందిన హిజ్రా అఖిల ప్రియ... 210 నిరుపేద కుటుంబాలకు సరకులు పంచారు.
గాలివీడు మండలం గుండ్ల చెరువు, గరుగుపల్లి గ్రామాల్లోని 210 కుటుంబాలకు.. ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి సరకులు అందించారు. స్థానిక ఎస్ఐ ఇనాయి తుల్లా, మహిళా పోలీసు జ్యోతి సహకరించారు.
ఇదీ చూడండి: