కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడప నగరం మొత్తం నీట మునిగిందని... అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇళ్లు నీట మునిగాయని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ విమర్శించారు. ప్రజలకు సహాయం చేయడంలో అధికారులు, నాయకులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వరద నీటిలో చిక్కుకున్న ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కంది బేడలు, చింతపండు, తదితర నిత్యావసర వస్తువులు అన్నింటినీ ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో మేయర్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి... కడపను సింగపూర్ చేస్తానని కనీసం పుంగనూరు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు ఉన్న మేయర్ సురేష్ బాబు కడప నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఇప్పుడు ఇప్పుడు నగరంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. నగరం మొత్తం అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వరద బాధితులకు సహాయం అందించాలని కోరారు.
ఇదీ చదవండీ.... ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు