కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఓ మోస్తరు వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి శివారు ప్రాంత కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా నీట మునిగి, గ్యారేజ్‌లో నీరు చేరడంతో కార్మికులు ఇబ్బంది పడ్డారు. మోటర్ల సహాయంతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిలిచిన నీటిని పంపింగ్ చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లోని 16 మండలాల్లో అత్యధికంగా వేముల మండలంలో 82.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముద్దనూరు 53.8, జమ్మలమడుగులో 52.4, పులివెందులలో 47, వేంపల్లిలో 32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి..: లారీకి తగిలిన విద్యుత్ తీగలు.. షాక్ కొట్టి వ్యక్తి మృతి