నిన్నటి వరకు ఎండలతో సతమతమైన కడప వాసులు ఈరోజు కురిసిన వర్షంతో సేదతీరుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాకతో వాతావరణం కాస్త చల్లబడటంతోపాటు ఆకాశమంత నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అరగంట పాటు భారీ వర్షం కురవడం నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కరోనా వైరస్ ఎక్కడ విజృంభిస్తోంది అనే భయం వెల్లబుచ్చుతున్నారు.
ఇవీ చూడండి... ప్రొద్దుటూరులో వెయ్యి టన్నుల ఇసుక స్వాధీనం