ETV Bharat / state

పులివెందులలో జడివాన.. పులకరించిన ప్రజలు - పులివెందులలో వర్షలు

ఆదిత్యుని వేడికి అల్లాడుతున్న కడప జిల్లా పులివెందులవాసుకు.. హఠాత్తుగా కురుసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. చల్లటి గాలులు, చిరుజల్లులతో ప్రారంభమై.. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.

జడివాన
Heavy rain
author img

By

Published : Apr 22, 2021, 8:28 AM IST

కడప జిల్లా పులివెందులలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సూర్యభగవానుడి వేడిమికి అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఊరటనిచ్చింది. నిన్న సాయంత్రం చల్లటి గాలులతో ప్రారంభం అయి.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

పులివెందులలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే వేముల మండలం మబ్బుచింతలపల్లె గ్రామంలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడి చెట్టు కాలిపోయింది. ఆ సమయంలో చుట్టూ ఎవరూ లేని కారణంగా ప్రాణ నష్టం తప్పింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో అకాలవర్షం... మామిడి రైతులకు తీరని నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.