కడప జిల్లాలోని కుందు, పెన్నా నదులు జల కళ సంతరించుకుంటున్నాయి. వీటిలో నీటి ప్రవాహం పెరిగింది. శనివారం ఉదయం కుందునదిలోకి 14 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... ఆదివారం ఉదయానికి 16 వేల క్యూసెక్కులకు చేరుకుంది. పెన్నానదిలో 16 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... 18 వేల 900 క్యూసెక్కులు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి: