ETV Bharat / state

కడపలో కరోనా కలవరం... భారీగా పాజిటివ్ కేసులు నమోదు - కడప నేటి వార్తలు

కడప జిల్లాలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా నగరంలో కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో స్థానిక పోలీసులు లాక్​డౌన్ విధించారు.

heavy-corona-cases-registered-in-kadapa
బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
author img

By

Published : Jun 28, 2020, 4:16 PM IST

కడప నగరంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫలితంగా పోలీసులు, అధికారులు మళ్లీ లాక్​డౌన్ విధించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

నగరంలోని రాజా రెడ్డి వీధి, నకాష్, నబీ కోట తదితర ప్రాంతాల్లో లాక్​డౌన్ విధించారు. రాజారెడ్డి వీధిలో అత్యధిక కేసులు వెలుగు చూడటంతో పోలీసులు.. స్థానికులకు పాసులు మంజూరు చేశారు. అవి ఉన్న వారిని మాత్రమే కాలనీలోకి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి మరింత కఠినంగా లాక్​డౌన్​ను అమలు చేస్తామని డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పీఎంఏజీవై పథకంపై అధికారులతో కడప జిల్లా కలెక్టర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.