కడప వ్యవసాయ మార్కెట్ కు ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చిన పసుపు లారీని అధికారులు సీజ్ చేశారు. లారీలో 31 టన్నుల పసుపు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా లారీ రావడంతో అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గౌతమికి వివరాలు అందజేశారు.
ప్రస్తుతం కడప మార్కెట్ యార్డులో ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తోంది. క్వింటాకు 6,850 రూపాయల మద్దతు ధర చెల్లిస్తోంది. ఈ-క్రాప్ లో పేరు నమోదు చేసుకున్న రైతుల పసుపును మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా లారీ వచ్చిందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.