ETV Bharat / state

నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది... గువ్వల చెరువు పాలకోవా...

author img

By

Published : Nov 1, 2020, 11:25 AM IST

Updated : Nov 2, 2020, 12:04 PM IST

పాలకోవా అంటే ఎవరికైనా నోరూరుతుంది. ఎంతో రుచికరమైన పాలకోవాకు కడప జిల్లాలోని గువ్వలచెరువు ఎంతో ఫేమస్​... ఇక్కడ తయారు చేసే పాలకోవాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఎంతో గిరాకీ ఉంది. గువ్వలచెరువు గ్రామంలో పాలకోవా తయారు చేయడానికి రోజూ పదివేల లీటర్ల పాల విక్రయం జరుగు తుండటం గమనార్హం.

guvvala cheruvu palakova
గువ్వల చెరువు పాలకోవా... మామూలుగా ఉండదు.

సాధారణంగా తీపి అంటే చాలా మందికి ఇష్టముంటుంది. అందులోనూ పాలకోవా అంటే మరీనూ... హైదరాబాద్​లో పుల్లారెడ్డి స్వీటు ఎంత ఫేమసో.... కడప జిల్లాలో గువ్వల చెరువు పాలకోవా అంతే ఫేమస్. ఈ పాలకోవకు వందేళ్ల చరిత్ర ఉంది.

గువ్వల చెరువు అంటేనే మెుదటగా గుర్తుచ్చేది...పాలకోవా

కడప - బెంగళూరు జాతీయ రహదారి పక్కన రామాపురం మండలం గువ్వలచెరువులో పాలకోవా వందేళ్ల కిందట నుంచి తయారీ చేస్తున్నారు. స్వచ్ఛమైన, రుచికరమైన పాలకోవాను గువ్వలచెరువులో 15 కుటుంబాలు చిన్న కుటీర పరిశ్రమగా ఎంచుకున్నారు. వందేళ్ల కిందట వారి కుటుంబ సభ్యులు నుంచి వారసత్వంగా వచ్చిన పాలకోవా తయారీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కేవలం పాలు, పంచదార మిశ్రమంతో స్వచ్ఛమైన గువ్వలచెరువు పాలకోవా తయారీ చేస్తున్నారు.

పాల సేకరణ

15 కుటీర పరిశ్రమల నుంచి తయారయ్యే పాలకోవా కోసం రోజుకు పదివేల లీటర్ల పాలు అవసరం అవుతోంది. ఈ పాలను రామాపురం, రాయచోటి, సుండుపల్లె, పింఛ గ్రామంతో పాటు చిత్తూరు జిల్లాలోని కలకడ, పీలేరు, మదనపల్లె ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. తెల్లవారుజామునే ఆటోలు తీసుకెళ్లి పాడి రైతుల వద్ద నుంచి ఆవు, ఎనుములు నుంచి పాలను సేకరిస్తున్నారు. లీటర పాలు 35 నుంచి 45 రూపాయలతో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. పాలకోవ తయారీ కోసం సమీపంలోని కొండల నుంచి టన్నుల కొద్దీ దుంగలను కొనుగోలు చేస్తున్నారు.

తయారీ విధానం

పాలకోవా తయారు చేయాలంటే ముందుగా సిద్ధం చేసిన పెనంలో 500 నుంచి వెయ్యి లీటర్ల వరకు ఒక్కో కుటుంబం స్వచ్ఛమైన పాలను వేడి చేస్తారు. దాదాపు నాలుగైదు గంటలు పాలను వేడి చేయడం ద్వారా చిక్కగా పాకం వచ్చే వరకు పాలను కరిగిస్తారు. మీగడ కూడా బయటికి తీయకుండా పాలను కరిగిస్తారు. చిక్కగా పెరుగు వలె పాలు తయారైన తర్వాత వాటిలో పంచదార వేసి కలుపుతారు. వందలీటర్ల పాలను వేడిచేస్తే అందులో 20 కిలోల వరకు చక్కెర వేసి కలుపుతారు. ఈ లెక్కన రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాలకోవా తయారీలో కుటుంబాలు నిమగ్న మవుతున్నాయి. ఇది వీరికి కుటీర పరిశ్రమగా, ఉపాధి మార్గంగా తయారైంది.

ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు

గువ్వలచెరువులో తయారైన పాలకోవాను హోల్ సేల్​గా దుకాణాలకు విక్రయిస్తారు. కడప-బెంగళూరు జాతీయ రహదారి పక్కనే గువ్వలచెరువు గ్రామం ఉండటంతో రహదారికి ఇరువైపుల దుకాణాల్లో పాలకోవాను విక్రయిస్తున్నారు. జాతీయ రహదారికి రెండువైపుల దాదాపు 70 దుకాణాలు చిన్న కొట్లు పెట్టుకుని స్వచ్ఛమైన పాలకోవాను విక్రయిస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో కడప నుంచి బెంగళూరు, చిత్తూరు, ముంబాయి వెళ్లే వాహనదారులు ఇక్కడ ఆగి పాలకోవా కొనుగోలు చేసి వెళ్తున్నారు. రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా విజయవాడ, రాజమండ్రి, గుంటూరు జిల్లాలతోపాటు హైదరాబాద్ కూడా గువ్వల చెరువు పాలకోవా ఎగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి హోల్ సేల్ గా కొనుగోలు చేసుకుని లగేజీ ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం గువ్వలచెరువు పాలకోవా రిటైల్ గా కిలో 180 రూపాయలకు విక్రయిస్తున్నారు.

లాభాలు తక్కువే

ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 కుటుంబాలకు చెందిన ఇంటిళ్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే కూలి పాటు మాత్రమే వస్తోందని కుటీర పరిశ్రమ నడుపుతున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారి ఒక్కో కుటుంబం 30 నుంచి 40 వేల రూపాయల వరకు పాలకోవా తయారీకి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కొందరు ఇళ్లలోనే వేడి, పొగకు తట్టుకుని పాలకోవా తయారు చేస్తున్నారు. ఓ వ్యక్తి గతంలో పాలకోవా తయారు చేస్తూ బీపీ తగ్గి పాలకోవా పెనంలో పడి శరీరమంతా గాయాలయ్యాయి. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగి కోలుకున్నాడు. వేరే గత్యంతరం లేక ఏళ్ల తరబడి ఇదే వ్యాపారం సాగిస్తున్నామని తయారీ దారులు అంటున్నారు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయంలేదు

శతాబ్ధకాలం నుంచి గువ్వలచెరువు పాలకోవా అంటే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఇక్కడ కుటీర పరిశ్రమలు నిర్వహిస్తూ పాలకోవా తయారు చేస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు అందడం లేదనే వాదన ఉంది. వారికి చేయూత అందిస్తే... మరికొందరికి ఉపాధి లభించే వీలుంది. ఈ పాలకోవా తయారీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.

ఇవీ చదవండి

'రైల్వే లైన్​ సర్వే త్వరితగతిన పూర్తి చేయండి'

Last Updated : Nov 2, 2020, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.