కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ రసాబాసగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్‌ను అడ్డుకుని కళాశాల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికంగా చదివే విద్యార్థులు బయటకెళ్లి చదువు కోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గందరగోళం మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఇదీ చదవండి :