కడప జిల్లాలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1860 ప్రాథమిక, 173 ప్రాథమికోన్నత, 96 ఉన్నత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చాలా పాఠశాలలో మైదానాలు ఇప్పటికీ కరువయ్యాయి. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలతోపాటు ప్రభుత్వం బూట్లు కూడా పంపిణీ చేస్తోంది. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తుండటంతో... చాలామంది ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.
కడప జిల్లా బద్వేల్లో ప్రభుత్వ పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టి... విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చుదిద్దుతామని ఉపాధ్యాయులు వివరించారు.
ఇదీ చదవండీ...