సంక్షేమ హాస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్కర్స్ కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులు ఔట్ సోర్సింగ్ కార్మికులను ఇష్టారీతిన బదిలీలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్త చేశారు. కార్మికులతో పని చేయించుకుంటూ... నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదంటూ వాపోయారు. ప్రతి వంద మంది విద్యార్థులకు ముగ్గురు చొప్పున సిబ్బంది ఉండాలని నిబంధనలు ఉన్నా... వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ధర్నా అనంతరం హాస్టల్ సిబ్బంది సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి: సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన