టిడ్కో గృహాలు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని తెదేపా కడప జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. 'నా ఇల్లు నా సొంతం' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని యర్రగుంట్ల, ప్రొద్దుటూరు పట్టణాల్లో పూర్తయిన..నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల కోసం లబ్ధిదారులు అప్పులు తెచ్చి డిపాజిట్లు కట్టారని..సర్కారు మాత్రం వారికి ఇళ్లు కేటాయించకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. సంక్రాంతిలోపు అర్హులకు గృహ సముదాయాన్ని అప్పగించకపోతే పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: