రైల్వేకోడూరులో ఘనంగా గొబ్బెమ్మ పండుగ - Gobbemma festival in the railwaykodur
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, మండలాలలో గొబ్బెమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున గొబ్బెమ్మలకు పూజచేసి.... కోలాటాలు ఆడారు. అనంతరం గొబ్బెమ్మను నిమజ్జనం చేశారు.
Body:కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, మండలాలలో గొబ్బెమ్మ పండుగలు ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు రైల్వే కోడూరు పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున గొబ్బెమ్మలకు పూజచేసి కోలాటాలు వేస్తూ, ఏటికీ సాగనంపే కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సంక్రాంతి వచ్చిందంటే రైల్వేకోడూరు నియోజకవర్గంలో గొబ్బెమ్మ పండుగ మొదలవుతుంది. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.