ETV Bharat / state

గాలేరు నగరి - సుజల స్రవంతి పథకానికి రివర్స్ టెండరింగ్​ - గాలేరు నగరి-సుజల స్రవంతి పథకం న్యూస్

కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గాలేరు నగరి-సుజల స్రవంతి పథకం (జీఎన్​ఎస్ఎస్) పనులకు ప్రభుత్వం రివర్స్ టెండర్లు పిలిచింది. జీఎన్​ఎస్ఎస్​ రెండోదశ పనుల్లో ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు 25 శాతం కూడా చేయని కారణంగా వాటిని రద్దు చేశారు. రెండు ప్యాకేజీలు కలిపి 735 కోట్ల రూపాయలతో రివర్స్ టెండర్లు పిలిచింది ప్రభుత్వం.

గాలేరు నగరి-సుజల స్రవంతి పథకానికి రివర్స్ టెండరింగ్​

author img

By

Published : Dec 20, 2019, 12:05 AM IST

గాలేరు నగరి-సుజల స్రవంతి పథకానికి రివర్స్ టెండరింగ్​

కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గాలేరు నగరి-సుజల స్రవంతి పథకం (జీఎన్​ఎస్ఎస్​) పనులకు ప్రభుత్వం రివర్స్ టెండర్లు పిలిచింది. జీఎన్​ఎస్ఎస్​ రెండోదశ పనుల్లో ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు 25 శాతం కూడా చేయని కారణంగా వాటిని రద్దు చేసింది. రెండు ప్యాకేజీలు కలిపి 735 కోట్ల రూపాయలతో రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.

కడప, చిత్తూరు జిల్లాల్లో 2 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో గాలేరు నగరి-సుజల స్రవంతి పథకాన్ని 2005లో చేపట్టారు. జీఎన్ఎస్ఎస్ మొదటి దశ కింద కర్నూలు జిల్లాలో 2155 కోట్ల రూపాయలతో పనులు మెుదలుపెట్టారు. రెండో దశ కింద కడప, చిత్తూరు జిల్లాలో 2189 కోట్ల రూపాయలతో ప్రధాన కాల్వ, పంట కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణానికి 2005లో టెండర్లు పిలిచారు. రెండోదశ పనులను 14 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదార్లకు అప్పగించారు. 946 కోట్ల రూపాయలతో ఒకటి నుంచి 7వ ప్యాకేజీ పనులు చేపడితే.... 13 ఏళ్లు గడిచినా 20 శాతం కూడా పనులు జరగలేదు. గతంలో టెండర్లు దక్కించుకున్న సంస్థ... నేటికి 20 శాతం కూడా పనులు చేయలేదు. ఫలితంగా వాటిని రద్దు చేసిన వైకాపా ప్రభుత్వం... డిసెంబరు 2 నుంచి జీఎన్ఎస్ఎస్ రెండోదశ ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులకు రివర్స్ టెండర్లు పిలిచింది.

ప్యాకేజీ-1 కింద 395 కోట్ల రూపాయలు, ప్యాకేజీ-2 కింద 350 కోట్ల రూపాయలతో రివర్స్ టెండర్లు పిలిచినట్లు జల వనరులశాఖ సీఈ మగ్బూల్ అహ్మద్ తెలిపారు. రెండు ప్యాకేజీలకు 735 కోట్ల రూపాయలతో రివర్స్ టెండర్లు పిలిచామని... ఆన్​లైన్​లో ఎవరు తక్కువకు టెండర్ వేస్తారో.. డిసెంబరు 19 నుంచి మళ్లీ తక్కువ టెండర్ కు కోట్ చేసే విధంగా రివర్స్ టెండర్ పిలుస్తామని చెప్పారు. ప్యాకేజీ-1 పనులకు ఈనెల 18న, ప్యాకేజీ-2 పనులకు ఈనెల 21న టెండర్లు దాఖలు చేయడానికి తుది గడువును ప్రభుత్వం నిర్ణయించింది.

జీఎన్ఎస్ఎస్ తోపాటు కడపజిల్లాలోని బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ లైనింగ్ పనులకు రివర్స్ టెండర్లు పిలిచారు. కర్నూలు జిల్లా వెలిగోడు ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ ప్రధాన కాల్వ 18 కిలోమీటర్ల వరకు లైనింగ్ దెబ్బతింది. 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం కల్గిన ప్రధాన కాల్వ ద్వారా ప్రస్తుతం 800 నుంచి వెయ్యి క్యూసెక్కులు కూడా రావడం లేదు. ప్రభుత్వం 18 కిలోమీటర్ల కాల్వకు లైనింగ్ పనులు చేయడానికి 234 కోట్ల రూపాయలతో రివర్స్ టెండర్లు పిలిచింది. ఆన్ లైన్ లో టెండర్లు దాఖలు చేయడానికి డిసెంబర్ 23న తుది గడువు విధించారు. 17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్రహ్మంసాగర్ జలాశయంలో ప్రస్తుతం 6 టీఎంసీలు కూడా లేని పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా లైనింగ్ లేకపోవడం వల్ల జలాశయం నిండటం లేదనేది అధికారుల వాదన.

ప్రస్తుతం గాలేరు నగరి-సుజల స్రవంతి పథకం రెండోదశలో భాగంగా తొలి రెండు ప్యాకేజీలకు రివర్స్ టెండర్లు పిలిచిన అధికారులు... త్వరలోనే మిగిలిన ఐదు ప్యాకేజీలకు రివర్స్ టెండర్లు పిలవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఇదీ చదవండి:

15వ ఆర్థిక సంఘం దృష్టికి.. రాష్ట్ర సమస్యలు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.