పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఈనాడు -ఈటీవి భారత్, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం.... పాత బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడం వల్ల మనుషులతో పాటుగా పశువులు... మొక్కలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు