గండికోటలో వారసత్వ ఉత్సవాలను పురస్కరించుకొని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా శోభాయాత్ర సాగింది. ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.....టీఆర్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా పగటి వేషాలు, నెమలి నృత్యం, కొమ్ము కోయ కోలాటం, ఎద్దుల పోటీలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నతరహా విమానాల విహంగ వీక్షణం ఆకట్టుకుంది. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ఇవీ చదవండి...గండికోట ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు