ETV Bharat / state

ఈ పాట.. గండికోట నిర్వాసితుల ఆవేదన - సమస్యలపై గండికోట నిర్వాసితుల పాట తాజా వార్తలు

కడప జిల్లాలో గండికోట నిర్వాసితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు గండికోట జలాలు తాళ్ల పొద్దుటూరు గ్రామాన్ని ముంచెత్తుతున్నాయి. మరోవైపు అధికారులు పునరావాస కాలనీలను సిద్ధం చేయలేదు.

ఈ పాట.. గండికోట నిర్వాసితుల కష్టాల కన్నీటికి సాక్షాత్కరం

author img

By

Published : Sep 22, 2020, 4:10 AM IST

గండికోట నిర్వాసితుల కోసం తాళ్ల పొద్దుటూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్​లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేశారు. అక్కడ సరైన సదుపాయాలు లేక నిర్వాసితులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే గండికోట జలాలు... ఊరిలోని బీసీ, ఎస్సీ కాలనీలో చేరిపోయాయి. సుమారు రెండు వందల కుటుంబాలకు పైగా నిర్వాసితులు అధికారులు చెప్పిన ప్రత్యామ్నాయ కేంద్రాల్లో నివాసముంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే అవకాశం ఉందని.. త్వరగా ఖాళీ చేయమని చెప్పడం వల్ల బాధితులు తమ ఆవేదనను పాటల రూపంలో పాడుకుంటున్నారు. గండికోట నిర్వాసితుల దీక్షలు సోమవారం 19 రోజు కూడా కొనసాగించారు.

ఈ పాట.. గండికోట నిర్వాసితుల కష్టాల కన్నీటికి సాక్ష్యం

ఇదీ చదవండి: మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్​ చేయాలని విపక్షాలు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.