'రైతులే నేరుగా తమ పంటను విక్రయించవచ్చు' - Gadikota Srikanth Reddy latest news update
మార్కెటింగ్ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. రాయచోటిలో రైతుబజార్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ఆయన.. హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
కడప జిల్లా రాయచోటిలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో రైతులు పండించిన కూరగాయలను తీసుకొచ్చి రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించుకోవచ్చని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. వేరుశనగ, కంది, వరికి గిట్టుబాటు కల్పించామన్నారు.
ఇవీ చూడండి:
Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో బుధవారం రైతుబజార్ ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి భూమి పూజ చేశారు పట్టణంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయ ఆవరణంలో 30 సెంట్ల విస్తీర్ణంలో ఈ బజార్ రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గంలోని రైతులు పండించిన కూరగాయలను తీసుకొచ్చి రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించు కోవచ్చని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాను దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులు పండించిన పంటలను విక్రయించుకునే వెసులుబాటు కల్పించడంతోపాటు వేరుశనగ కంది వరి వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందని ఆయన వివరించారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు రాయచోటిలో సాగు తాగునీటి అవసరాలకు టెండర్ల ప్రక్రియ మొదలైంది అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ అధికారులు వైసిపి నాయకులు పాల్గొన్నారు
Body:బైట్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్
Conclusion:రాయచోటిలో రైతు బజార్ ఏర్పాటు కు భూమి పూజ
Body:బైట్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్
Conclusion:రాయచోటిలో రైతు బజార్ ఏర్పాటు కు భూమి పూజ