ETV Bharat / state

సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి నిధుల కొరత - సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి నిధుల కొరత వార్తలు

తెలుగు భాషకు 'సీపీ బ్రౌన్‌' చేసిన సేవలకు గుర్తుగా మిగిలిన ఏకైక స్మారకం అది. వేల పుస్తకాలు, తాళపత్ర గ్రంథాల పరిరక్షణా నిలయం. ఏం జరిగిందో ఏమో. ఒక్కసారిగా నిధులకు కోత పడింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితిలోకి జారిపోయింది. బ్రౌన్‌ చారిత్రక పాత్రకు నిలువెత్తు సాక్ష్యమైన ఆ విశిష్ట గ్రంథాలయం అవస్థలు... భాషాభిమానులను కలచివేస్తున్నాయి.

సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి నిధుల కొరత

author img

By

Published : Nov 22, 2020, 12:19 PM IST

సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి నిధుల కొరత

తెలుగుభాష సేవకు అంకితమై పాతికేళ్లుగా కొనసాగుతున్న సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని... నిధుల కొరత వేధిస్తోంది. పదిహేనేళ్లకు పైగా 30 లక్షల రూపాయల వార్షిక బడ్జెట్‌తో కొనసాగుతున్న గ్రంథాలయానికి... 2019 నుంచి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా వార్షిక బడ్జెట్‌లో భారీగా కోత పడింది. 36 లక్షల నుంచి 10 లక్షలకు తగ్గిపోయింది. కారణాలు మాత్రం తెలియరాలేదు. జానుమద్ది సాహితీ పీఠం అధ్యక్షుడు విజయభాస్కర్.... సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను సీఎం జగన్‌కు విన్నవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం 10 మంది సిబ్బంది పని చేస్తుండగా... ఏటా జీతాల కోసం కనీసం 20 లక్షల వరకూ ఖర్చవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 10 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో.... బ్యాంకులో ఉన్న కొద్దిపాటి నిల్వలతో నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యను యోగి వేమన విశ్వవిద్యాలయం అధికారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదు.

కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని 2005లో సందర్శించిన అప్పటి సీఎం వైఎస్ఆర్‌... గ్రంథాలయ పరిరక్షణ కోసం తొలిసారిగా 15 లక్షల రూపాయల వార్షిక బడ్జెట్ మంజూరు చేశారు. అనంతరం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా పేరు మార్చి... బడ్జెట్ సైతం 30 లక్షలు చేశారు. 2018-19 నుంచి గత ప్రభుత్వం 36 లక్షల రూపాయలకు పెంచింది. 2019 తర్వాత నిధుల కష్టాలు ప్రారంభమయ్యాయి.

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం పాతికేళ్లు పూర్తి చేసుకుంటుండగా... ఈ నెల 29, 30 తేదీల్లో రజతోత్సవాలు జరగనున్నాయి. తెలుగు భాషకే అంకితమైన ప్రాచీన పుస్తక భాండాగారం పరిరక్షణకు ప్రభుత్వం తగిన రీతిలో చేయూత అందించాలని భాషాభిమానులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.