ETV Bharat / state

పెట్రోల్ పోసుకుని పండ్ల వ్యాపారి ఆత్మహత్యాయత్నం - fruit seller suicide news in kadapa dst

రహదారి పక్కన తాత్కాలిక గుడారం వేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిని.. ఆ కట్టడాన్ని తొలగించమని పురపాలక అధికారులు సూచించగా ఆ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.

fruit seller commite suicide attempt with petrol in kadapa dst rajampeta

author img

By

Published : May 19, 2020, 10:14 PM IST

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహం కార్యాలయానికి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నరసింహులు అనే వ్యక్తి గుడారం వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ గుడారానికి విద్యుత్ మీటర్​ని కూడా బిగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ రాజశేఖర్ తన సిబ్బందితో వెళ్లి గుడారాన్ని తొలగించి బండిపై వ్యాపారం చేసుకోవాలని తెలిపారు.

మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నా..ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా వ్యాపారి సిబ్బందితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పెట్రోల్​ని ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పట్టణ ప్రణాళిక అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని తొలగించేశారు.

ఇదీ చూడండి విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.