కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్వాగతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. విద్యార్థులకు సమయపాలన ఎంతో అవసరమని...ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిత్య పఠనం తప్పనిసరి అని తెలిపారు. జీవితంలో ఎంత పెద్దస్థాయికి ఎదిగినా ఒదిగి జీవించాలన్నారు. ఎదిగిన స్థాయిని నిలబెట్టుకునేందుకు వినయ విధేయతలే సోపానాలు అని విద్యార్థులకు వివరించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె: ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు