కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే పంటలు నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగిలేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదలడంతో బద్వేల్ మండలంలోని రాజుపాలెం, పుట్టాయిపల్లి, గొడుగునూరు గ్రామాల్లో వరి పత్తి పంటలు నీట మునిగాయి. సుమారు కోటిన్నర రూపాయల మేర నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలో సర్వే నిర్వహించి పంట నష్టం అంచనాలను తయారు చేస్తున్నారు.
ఇదీ చదవండి