కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావుకు ప్రభుత్వం ఇటీవలే స్థాన చలనం కల్పించింది. బదిలీ అయిన తర్వాతా.. ఆయనపై అవినీతి ఆరోపణలు ఆగడం లేదు. శ్రీనివాసరావు రెండేళ్లుగా ప్రొద్దుటూరులో సివిల్ పంచాయితీలు, క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా, గ్యాంబ్లింగ్ రాయుళ్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆరోపించారు. అనతి కాలంలోనే రూ.3 కోట్లు సంపాదించారన్నారు. ఆయన అవినీతిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మాజీ డీజీపీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తాజాగా కడప ఎస్పీ అభిషేక్ మొహంతికీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావును ఎక్కడికి బదిలీ చేసినా... విచారణ చేసి సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని వరదరాజులురెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తానని చెబుతున్నారనీ.. అవినీతి పరులైన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...