కడప జిల్లా రాజంపేటలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్, శివాలయం మీదుగా ఆంజనేయస్వామి ఆలయం వరకు హరేరామ- హరేకృష్ణ నగర సంకీర్తన సాగింది. రష్యాకు చెందిన విదేశీయులు హరేరామ - హరేకృష్ణ.. కృష్ణకృష్ణ - హరేహరే అంటూ భక్తి గీతాలు ఆలపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ, కృష్ణ తత్వాన్ని బోధిస్తూ ఈ సంకీర్తన సాగింది. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఇవీ చదవండి: