కడప జిల్లా బద్వేలు మండలం సి.బోయినపల్లెలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే కారణంతో మంగళవారం రాత్రి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే తల్లిదండ్రులు మరికొంతమందితో కలిసి మృతదేహాన్ని ఖననం చేశారు. వీఆర్వో నరసింహులు ఫిర్యాదుతో... తండ్రితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
సి.బోయినపల్లికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. తాను ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అతనినే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పింది. ఈ ప్రేమ వ్యవహారాన్ని వాళ్లు అంగీకరించలేదు. మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలిస్తే కేసు నమోదు చేస్తారని భావించి .. అదే రోజు రాత్రి మృతదేహాన్నిశ్మశానవాటికలో ఖననం చేశారని డీఎస్పీ తెలిపారు. వీఆర్వో నరసింహులు ఫిర్యాదుతో తండ్రి పిల్లిబోయిన రమణయ్యతోపాటు మరో ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. విద్యార్థిని మృతి అసహజ మరణం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి