ETV Bharat / state

ప్రొద్దుటూరు తినుబండారాల గోడౌన్​లో భారీ అగ్నిప్రమాదం - కడప జిల్లాలో తాజా అగ్నిప్రమాదం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని లక్ష్మీనగర్‌ వద్దనున్న తినుబండారాల గోడౌన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. రూ.30లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీయటంతో ప్రాణాపాయం తప్పింది.

proddutoor
ప్రొద్దుటూరు తినుబండారాల గోడౌన్​లో భారీ అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 28, 2020, 9:15 PM IST

ప్రొద్దుటూరు తినుబండారాల గోడౌన్​లో భారీ అగ్నిప్రమాదం

కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైదుకూరు రోడ్డులోని తినుబండారాల పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్... చిన్నారులు తినే తినుబండారాలను హైదరాబాద్ నుంచి తెప్పించి గోడౌన్​లో భద్రపరుస్తుంటాడు. అక్కడి నుంచి పట్టణంలోని దుకాణాలతో పాటు జిల్లాలోని పలు మండలాలకు సరఫరా చేస్తారు. అగ్ని ప్రమాదంతో గోడౌన్​లో సరుకు మొత్తం కాలిపోయిందని బాధితులు వాపోయారు. సుమారు రూ.30 లక్షలు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

ఇవీ చూడండి:

బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.