ETV Bharat / state

కోట్లు విలువచేసే స్థలం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ - కోట్లు విలువచేసే స్థలం కోసం రెండు వర్గాల ఘర్షణ

కడప నగరం నడిబొడ్డున కోట్ల విలువ చేసే స్థలం కోసం రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని దస్త్రాలను పరిశీలించారు. త్వరలో వివాదస్పద స్థలంపై విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

కోట్లు విలువచేసే స్థలం కోసం రెండు వర్గాల ఘర్షణ !

author img

By

Published : Jul 9, 2020, 4:27 PM IST

కడప నగరం నడిబొడ్డున కోట్ల విలువ చేసే స్థలం కోసం రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఈ స్థలం మాకు ప్రభుత్వం కేటాయించిందని ఒక వర్గం వారు... ఇది మా స్థలం అంటూ మరో వర్గం వారు ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని రెండు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు.

వివరాల్లోకి వెళ్తే... కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్తా కాలనీలో పదేళ్ల క్రితం 8 మంది లబ్ధిదారులకు 24 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ స్థల యజమానులు ఆర్థిక ఇబ్బందులతో గృహాలు నిర్మించుకోలేదు. ఇదే అదునుగా భావించి మరో వర్గం వారు ఈ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడికి చేరుకున్న స్థల యజమానులు నిర్మాణాలను అడ్డుకున్నారు. ఆందోళనకారులకు అండగా భాజపా నాయకులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇంతలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి దస్త్రాలు పరిశీలించారు. ఈ స్థలాలు ఎవరి పేరు మీద ఉంటే వారికే కేటాయిస్తామని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలో వివాదస్పద స్థలంపై విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని వీఆర్వో భాస్కర్ రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.