కడప జిల్లా జమ్మలమడుగు మండలం పూర్వపు సుగుమంచిపల్లె గ్రామంలో వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో సచివాలయం నిర్మాణం వద్ద కంకర.. రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దానిని తొలగించే విషయంలో ఘర్షణ తల జరిగినట్లు సమాచారం. గ్రామంలోని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన రాజేంద్రప్రసాద్‌కు, జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గానికి చెందిన వీరా రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగి.. ఒకరిపై ఒకరు కట్టెలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘర్షణలో గాయపడిన ఇరువర్గాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బద్వేలులో తనిఖీలు... రూ.16 లక్షలు పట్టివేత