ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కొత్త కమిటీ ఎన్నికకు సంబంధించిన 24 ప్యానళ్ళ ఎన్నికలు... గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఇందులోని స్టీల్ వ్యాపారుల ప్యానల్‌కు సంబంధించి 112 ఓట్లు వచ్చాయి. ఇవి స్టీల్ వ్యాపారుల విభాగంలోకి రావంటూ నుగ్గు సుధాకర్ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఓట్లను తొలగించాలని కోరడం సరైంది కాదని మురికి నాగేశ్వర్‌రావు వర్గం వ్యతిరేకింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లను తొలగించాలని నుగ్గు సుధాకర్ చేసిన అభ్యర్ధన మేరకు విచారణ చేసేందుకు గురువారం స్టీల్ వ్యాపారుల ప్యానల్ సభ్యులు సమావేశమైన సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో ఇరువార్గాలు ఘర్షణకు దిగాయి. తోపులాట జరిగింది. నుగ్గు సుధాకర్ కుడి భుజానికి తీవ్ర గాయమైంది. నాగేశ్వర్‌రావు వర్గానికి చెందిన రవికుమార్ అనే యువకుని భుజానికి గాయమైంది. ఆ పైన ఇరు వర్గాలు 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే... ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోలేదు. పోలీస్టేషన్‌లోనే అంగీకారానికి రావాలని ఇరు వర్గాలు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆలోచనలో పడ్డారు.
ఇదీ చదవండి :
గ్రూప్-2 స్క్రీనింగ్ ఫలితాల విడుదల
ఇదీ చదవండి :