కడప జిల్లా బద్వేలులో రైతులు నిరసన చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. లాక్డోన్ పేరుతో కూరగాయలను అమ్మనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కరోనా అంటే అందరికీ భయమేనని ఆయితే తాము అహర్నిశలు కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించకుండా చేస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బ్రాందీ షాపుల కంటే తాము అధ్వానంగా కనిపిస్తున్నామా అని పోలీసుల చర్యలపై మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తమ కష్టాలు గమనించి బద్వేలులో కూరగాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి...