కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం(Uranium) కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థ జలాలు పంటపొలాల్లోకి ప్రవహిస్తున్నాయని రైతులు(farmers) ఆందోళనకు దిగారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు టైల్ పాండు కింద ఉన్న సంపులోకి వరద నీరు భారీగా చేరింది. సంపులో ఉన్న వ్యర్థ జలాలు పొంగిపొర్లి తమ పొలాల్లోకి వస్తున్నాయని రైతులు(farmers) ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు చేరి ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయని.. రైతులు(farmers) ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణం దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభం