కడప జిల్లా రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద.. అయ్యవారిపల్లికి చెందిన రైతు బత్తిన గంగన్న యాదవ్ కుటుంబీకులతో కలిసి అర్థనగ్న ప్రదర్శన చేశాడు. తనకు చెందిన 1522/3 సర్వే నంబర్లోని భూమిని ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపించాడు. తన స్వాధీనంలోని భూమి చుట్టూ కంచెను తొలగించి.. దాదాపు వందేళ్లుగా పొలంలో ఉన్న రాగి చెట్టును పెకలించారని వాపోయాడు. తహసీల్దార్, ఆర్ఐ ప్రోద్బలంతోనే మాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించాడు. తక్షణమే సర్వే చేయించి ఆ భూమిని అప్పగించాలని వారు నినాదాలు చేశారు.
నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని గంగన్న యాదవ్ ఆరోపించాడు. తమవే కాక ఇతరుల భూములనూ.. వారికి నచ్చిన విధంగా తహసీల్దార్, ఆర్ఐ అంతర్జాలంలో తారుమారు చేస్తున్నారని పేర్కొన్నాడు. విధిలేని పరిస్థితుల్లో అర్థనగ్న ప్రదర్శనకు దిగామని తెలిపాడు. అధికారులు స్పందించి తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరాడు.
ఇదీ చదవండి: