ETV Bharat / state

పులివెందులలో వీఆర్ఓపై రైతు కత్తితో దాడి.. ఏం జరిగింది..? - farmer attack on vro with knife

Farmer attacked on VRO: గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులపై కత్తులతో దాడులు చేయడం,పెట్రోల్ పోయడం లాంటి వార్తలు చూస్తున్నాం.. అలాంటి ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. తన భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో పెద్ద మస్తాన్ అనే రైతు వీఆర్ఓపై కత్తితో దాడి చేశారు. వీఆర్ఓను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్య చికిత్సలు అందించారు. రైతు పెద్ద మస్తాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Farmer attacked VRO
వీఆర్ఓపై కత్తితో దాడిచేసిన రైతు
author img

By

Published : Nov 16, 2022, 3:34 PM IST

Farmer attacked on VRO with knife in AP: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వీఆర్ఓపై రైతు కత్తితో దాడి చేశారు. తన భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో రైతు పెద్ద మస్తాన్ వీఆర్ఓపై కత్తితో దాడి చేశారు. సోమవారం కలెక్టరేట్​లో స్పందనలో ఫిర్యాదు చేసి.. తన భూమిని ఆన్​లైన్ చేయాలని రైతు కోరారు. దానిపై విచారించిన పులివెందుల తహసీల్దారు ఆ భూములకు సంబంధించిన అంశాలు హైకోర్టు పరిధిలో ఉన్నందున.. ఆన్​లైన్​ చేయలేమని తెలియజేశారు. అయితే ఇవాళ ఉదయం మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతు పెద్ద మస్తాన్.. తన భూమి ఆన్​లైన్​ చేయాలని పదేపదే విజ్ఞప్తి చేశాడు. దీనికి వీఆర్ఓ కృష్ణమోహన్ నిరాకరించడంతో.. తన వెంట తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో వీఆర్ఓ వీపుపై పొడిచాడు. వీఆర్ఓను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్య చికిత్సలు అందించారు. రైతు పెద్ద మస్తాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీఆర్వోపై రైతు కత్తితో దాడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.