కడప జిల్లా రాజుపాలెం మండలం అర్కటవేముల గ్రామంలో విషాదం జరిగింది. పొలం పనుల కోసం ఎద్దులకు కాడికట్టి బయలుదేరిన గురివిరెడ్డి కరెంటు తీగలు తగిలి మృతి చెందాడు.ఎద్దులకు కట్టిన నాగలి ఇనుపది కావటంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోనే రైతు, ఎద్దులు విగతజీవులుగా పడి ఉండటం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మధ్యే సేద్యం కోసం కొత్తగా గురివిరెడ్డి ఎద్దులను కొనుగోలు చేశాడు. 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి నలుగురు సంతానం.
ఇదీ చూడండి