కడప జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. రేపు జరిగే రెండో విడత ఎన్నికలు జరిగే.. కడప, రాయచోటి పోలీస్ సబ్ డివిజన్లలోని 12 మండలాల్లో ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 31 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 400 మంది హెచ్‌సీ / ఏఎస్సైలు, 922 మంది కానిస్టేబుళ్లు, 409 మంది హోమ్ గార్డులు, 4 ఏపీఎస్పీ బలగాలు, 68 రూట్ మెుబైల్స్, 24 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 104 ఎస్పీఓలతో భద్రతా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యలను సృష్టించే వారిని గుర్తించి... కౌన్సిలింగ్ నిర్వహించటంతో పాటు, బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ఆటంకం కలిగించినా, గొడవలకు, ఘర్షణలకు దిగినా.. ఆయా వ్యక్తులపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మండలానికి ఒక డీఎస్పీ ఇన్ఛార్జిగా ఉంటూ.. పోలింగ్ జరిగే గ్రామాల్లోని పరిస్థితితులను సమీక్షిస్తారని వివరించారు. పోలింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నియమ నిబంధనలు పక్కాగా పాటించాలనీ... ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిస్తే.. డయల్ - 100 లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 9121100653 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని అన్బురాజన్ కోరారు.
ఇదీ చదవండి: