కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి.... తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో వీరశివారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని ఇప్పటికే తెదేపా అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ తనకు ఇస్తానని చెప్పి... చివరి నిమిషంలో చంద్రబాబు మాటమార్చారని ఆరోపించారు. ఈ కారణంగానే తాను... తన కేడర్... వైకాపా గెలుపు కోసం కృషి చేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్... విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం వైకాపాలో చేరుతున్నట్లు వీరశివారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి...