వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృధ్ధి నిలిచిపోయిందని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని సరస్వతి విద్యామందిరంలో దీన్‌దయాళ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు. కేంద్రం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. స్వీకరించే పరిస్థితి జగన్ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ రాజధానుల అంశాన్ని లేవనెత్తారని రావెల కిషోర్‌బాబు దుయ్యబట్టారు.
ఇవీ చూడండి...