ETV Bharat / state

'ప్రతి పౌరుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి' - మనం మన పరిశుభ్రత తాజా వార్తలు

పత్రి పౌరుడు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఈనెల 21 వరకు పరిశుభ్రత పక్షోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

'ప్రతి పౌరుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

author img

By

Published : Dec 7, 2020, 4:25 PM IST

ప్రతి పౌరుడు తమ ప్రాంతంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల వ్యతిరేక పోరాటంపై అవగాహన కల్పించేందుకు కడప కోటిరెడ్డి కూడలి నుంచి ఏడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని జేసీ ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 21 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలను కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన అవసరమన్న జేసీ... ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పరిశుభ్రత పక్షోత్సవాలు

మనం-మన పరిశుభ్రతలో భాగంగా విశాఖ జిల్లాలో వ్యర్ధాల వ్యతిరేక పోరాట కార్యక్రమాన్ని చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు "పరిశుభ్రత పక్షోత్సవాలు" నిర్వహిస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఎంపిక చేసిన 153 గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు, కరోనా వ్యాప్తి చెందకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ అధికారులు వెల్లడించారు.

ఇదీచదవండి

పోలీసుల అత్యుత్సాహం.. మహిళలు, వృద్ధులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.