కరోనా ప్రభావంతో పనులు లేక చాలామంది విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు రాయచోటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఛైర్మన్ నరసింహాచారి తెలిపారు. కడప జిల్లా రాజంపేట వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పేద విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు.
జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈ వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. వారిలో పేదలను ఆదుకునేందుకు తమ సంఘం ద్వారా ఇప్పటికే అనేక మండలాల్లో నిత్యావసర వస్తువులు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: